జగన్ పుట్టలో పాము కాదు, సోనియా బుట్టలో పాము: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టలో పాము కాదు అని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ బుట్టలో పాము అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కుమ్మక్కు అయ్యిందన్న వార్తలను రేవంత్ ఖండించారు. నిత్యం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అంటున్న జగన్ వర్గం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థిని ఎలా నిలబెట్టిందని ప్రశ్నించారు. టిడిపి గత 2007-08 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన అభ్యర్థిని నిలపలేదన్నారు. ఆ విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అప్పుడు నిలపనట్టుగానే ఇప్పుడు కూడా నిలపలేదని చెప్పారు.

జగన్, కాంగ్రెస్ కుమ్మక్కు అనేది అబద్దం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎలా నిలబెట్టారని ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రత్యేక తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను ఆమోదించే వరకు విధులకు దూరంగా ఉండాలని సవాల్ విసిరారు. ఆయన రాజీనామా లేఖ ఆకాశ రామన్న లేఖలా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+