హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు ధూళిపాల్ల నరేంద్ర చౌదరి మండిపడ్డారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో లాలూచీ పడ్డారని, అందుకే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఢిల్లీలో కెసిఆర్ సోనియాతో లాలూచీ పడితే ఇక్కడ తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు పేచీ పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమపై తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు బురద చల్లుతున్నారని ఆయన అన్నారు.
లాలూచీ పడకపోతే కెసిఆర్ పార్లమెంటులో సోనియాను నిలదీసి ఉండేవారని, టెన్ జనపథ్‌ను ముట్టడించి ఉండేవారని ఆయన అన్నారు. తెలంగాణపై కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే అలా చేశారని ఆయన విమర్శించారు. ఎరువుల కుంభకోణంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు ఉపసంహరించుకోవడంపై తెలుగుదేశం మరో శాసనసభ్యుడు దుర్గాప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
TDP MLA Dhulipalla Narendra condemned TRS MLA Harish Rao's comments on Chandrababu Naidu. He made comments that TRS president KCR colluded with Congress president Sonia Gandhi.
Story first published: Saturday, March 5, 2011, 15:21 [IST]