ఇక రోజూ బొద్దింకల పార్టీ సభలు..! హైదరాబాద్ లో ఎప్పుడంటే ?
దేశవ్యాప్తంగా వరుసగా పోటీ పరీక్షలు, సాధారణ పరీక్షలన్న తేడా లేకుండా చోటు చేసుకుంటున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఇవాళ పూణేలో తమ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కూడా ఢిల్లీ సభను మించి యువత తరలివచ్చారు. అలాగే లడఖ్ పోరాట యోధుడు సోనం వాంగ్ చుక్ సహా పలువురు ప్రముఖులు కూడా తరలివచ్చి కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇక రోజూ దేశంలోని ఏదో ఒక నగరంలో బహిరంగ సభలు నిర్వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒత్తిడి పెంచాలని భావిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ మేరకు నిరసనల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా వచ్చే నాలుగు రోజుల పాటు జరిగే నిరసనల తేదీలు, వేదికల వివరాలను ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇందులో ఇవాళ జరుగుతున్న పూణే సభ తర్వాత
లక్నో, అమృత్ సర్, హైదరాబాద్, జైపూర్ లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

CJP Founder @abhijeet_dipke asks students to commit that we will never engage in Hindu-Muslim politics in the future.
— Cockroach is Back (@Cockroachisback) June 11, 2026
He says the country has been left behind even as the world moves forward in AI, semiconductors and clean energy because of this backward politics. pic.twitter.com/fcYjEuyfhw
జూన్ 12న అంటే రేపు లక్నోలో కాక్రోచ్ పార్టీ బహిరంగ సభ ఉంటుంది. అలాగే జూన్ 13న అమృత్ సర్ లో, జూన్ 14న హైదరాబాద్ లో, జూన్ 15న జైపూర్ లో సభలు నిర్వహిస్తారు. ఇలా వరుసగా బహిరంగ సభలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచబోతున్న కాక్రోచ్ పార్టీ.. అప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించకపోతే తిరిగి ఈ నెల 20న ఢిల్లీలో సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఢిల్లీ సభకు మరోసారి భారీ ఎత్తున తరలి రావాలని యువతను కాక్రోచ్ పార్టీ కోరుతోంది. అయితే కేంద్రం మాత్రం కాక్రోచ్ పార్టీని, సభల్ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications