ఇలా చేస్తేనే కాక్రోచ్ లు బయటకు వస్తాయి చంద్రబాబు.. జాగ్రత్త..!!

సీఎం చంద్రబాబు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డీఎస్సీ నియామక ప్రక్రియ లో అక్రమాలు జరిగాయని మరోసారి ఆరోపించారు. స్పోర్ట్స్ కేటగిరీలో ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. మెడల్స్ ఉన్న వారికి ఉద్యోగాలు రాలేదని.. టీడీపీ నేతల పర్యవేక్షణలో ఉన్న స్పోర్ట్స్ సంస్థల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి అవకాశం ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం పైన సీబీఐ విచారణ చేయాలని మరోసారి డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకపోతే.. తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అక్రమాల మయంగా చేసారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు జరిగిన వ్యవహారం పైన పలు సందేహాలు వ్యక్తం చేసారు. చంద్రబాబు పాలనలోనే ఎప్పుడూ పరీక్ష పత్రాలు లీక్ అవుతాయని చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది జెన్ జీ కాలమని చంద్రబాబు గుర్తించాలని సూచించారు. దగాపడిన యువత వదలిపెట్టదని... కాక్రోచ్ లుగా బయలకు వస్తారని హెచ్చరించారు. నష్టపోయిన డీఎస్సీ అభ్యర్ధుల తరపున న్యాయ పోరాటం చేస్తామని...అప్పటికీ న్యాయం జరగకుంటే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కమిషన్ ఏర్పాటు చేసి తప్పు చేసిన వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీబీఐ విచారణ చేయాలని మరోసారి డిమాండ్ చేసారు.

రాజ్యసభకు మిస్ - గవర్నర్ గా ఛాన్స్..!?
రాజ్యసభకు మిస్ - గవర్నర్ గా ఛాన్స్..!?
ysrcp-chief-ys-jagan-says-that-the-dsc-recruitment-exercise-had-betrayed-the-trust-of-lakhs-of-aspir

సీబీఐ విచారణ చేయాలి

డీఎస్సీ పోస్టుల్లో ఎవరి కోసం సర్దుబాటు చేసారని జగన్ ప్రశ్నించారు. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని జీవో ఇచ్చిన అంశాన్ని గుర్తు చేసారు. సర్టిఫికెట్ అవసరం లేకుండా కేవలం ఆటలో పాల్గొంటే చాలనే విధంగా ఉద్యోగాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆటల్లో పాల్గొనే వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్స్ వచ్చిన వారికి ఇవ్వరా అని నిలదీసారు. తమ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్లు 4,47 ఇచ్చారని.. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి జీవో 23,25, 26 తో గేట్లు మూసేసారని ఆరోపించారు. రహస్యంగా తయారు చేయాల్సిన ప్రశ్నాపత్రం ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారని.. సెలెక్టెడ్ అభ్యర్ధులకు మాత్రమే మెసేజ్ లు పంపారని వివరించారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ ప్లే చేయలేదని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ పేరులో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేసారని.. ఇందులో అక్రమాలకు పాల్పడటం ద్వారా లక్షలాది మంది అభ్యర్ధులు బాధ పడుతున్నారని జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+