ఎమ్మెల్సీ రేసులో లేను, సోనియా చేతిలో నా భవిష్యత్తు: డిఎస్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తాను ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో లేనని, తాను ఎమ్మెల్సీ టికెట్ అశించడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భవిష్యత్తు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందని, సోనియాపై తనకు గౌరవం ఉందని, సోనియా ఏ పదవి ఇచ్చినా సరేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఈ రాత్రి లేదా రేపు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభించలేదనే మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు.
ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలో అది సోనియా గాంధీ ఇష్టమని ఆయన అన్నారు. బలాన్ని బట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా గులాం నబీ ఆజాద్‌ను వేయడం హర్షణీయమని, ఆజాద్‌కు రాష్ట్రంతో మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్‌ను వాయిదా వేసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాన్ని వేయడం మంచిదని ఆయన అన్నారు. అవసరమైతే తాను జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. మిలియన్ మార్చ్ వాయిదా పడకపోతే పరీక్షను వాయిదా వేయాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
PCC president D Srinivas said that he is not MLC election race. He said that he is mot aspiring mlc ticket. He said that no injustice was done to state in CWC appointments.
Story first published: Saturday, March 5, 2011, 15:05 [IST]