మిలియన్ మార్చ్ వాయిదాపై జెఏసిలో చర్చించి నిర్ణయిస్తాం: కెసిఆర్

మార్చి 10వ పరీక్షలు ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం మిలియన్ మార్చ్ వాయిదా ప్రసక్తిపై వెనక్కి తగ్గేది లేదన్నారు. అయితే మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయాలా వద్దా అనేది తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత జెఏసిలో చర్చించి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే ప్రకాశ్ కరత్ లాంటి వారు కూడా ఈ సమస్యను త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. కానీ తెలంగాణపై కేంద్రం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications