ఇంజినీరింగ్ విద్యార్థిని కృష్ణవేణి హత్య కేసు: రవికుమార్ అరెస్టు

స్నేహితుడి గదిలో తలదాచుకున్న రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి నగరానికి రప్పించారని సమాచారం. వివిధ కోణాల్లో విచారించిన అనంతరం రవికుమార్‌ను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విశాఖలోని శివాజీపాలేనికి చెందిన కృష్ణవేణి అనే వివాహిత విద్యార్థినిని ఆమె భర్త రవికుమార్ శుక్రవారం సాయంత్రం నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసిన విషయం తెలిసిందే. కాగా కృష్ణవేణి అంత్యక్రియలు విషాదఛాయల్లో ముగిసాయి. ఆమె మృతదేహానికి త్రీటౌన్ పోలీసులు శనివారం పోస్టుమార్టం జరిపించిన అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications