చంద్రబాబు చేతిలో బాలయ్య, ఎన్టీఆర్ బిడ్డలు నా బిడ్డలే: లక్ష్మీపార్వతి

Lamxi Parvathi
హైదరాబాద్: దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి చేతిలో ఉందని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి ఆదివారం ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు బాగా వంటబట్టిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన చేతుల్లోకి తీసుకున్నారన్నారు. గతంలో హరికృష్ణను బయటకు పంపించారు ఆ తర్వాత మళ్లీ టిడిపిలోకి రప్పించుకున్నారు.

గతంలో ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీయలేదు. కానీ ఇప్పుడు దగ్గరకు తీసుకుంటున్నారన్నారు. బాలకృష్ణ కూతురితో కూడా తన తనయుడికి వివాహం చేసి కుటుంబాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వారు ఎప్పటికైనా తప్పు తెలుసుకొని చంద్రబాబుతో విభేదించి బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. బాలయ్యబాబుకు తనపై ప్రేమ ఉందన్నారు. ఎన్టీఆర్ బిడ్డలు నా బిడ్డలే అని చెప్పారు.

వారు ఎప్పటికైనా తనతో కలుస్తారనే ఆశతో ఎదురు చూశానని, ఇకముందు కూడా చూస్తానని చెప్పారు. నా కుటుంబం గురించి నేను ఎప్పుడూ అనుచితంగా మాట్లాడలేదన్నారు. వారే ఎవరి మాటలో విని తొందరపాటుగా మాట్లాడుతున్నారన్నారు. బాలయ్య తన ఇంటికి కూడా వచ్చారని అప్పటినుండి తాము మాట్లాడుకున్నది, పోట్లాడుకున్నది లేదన్నారు. బాలయ్యనుండో, ఎన్టీఆర్ కుటుంబం నుండి తనకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. వారు అటువంటి వ్యక్తులు కాదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నేను ఏమీ అనను అన్నారు.

అయితే ఎన్టీఆర్ ప్రతిష్టను మాత్రం ఎవరూ మసకబారనీయవద్దు అని ఆమె కోరారు. ఎప్పటికైనా వాళ్లు నన్ను కలుపుకుంటారనే ఆశతో ఉన్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+