నాగం జనార్దన్ రెడ్డిపై ఆనాడు దాడి, ఈనాడు ఆలింగనాలు

చంద్రబాబుతో విభేదాలు, మిగతా తెలంగాణ శాసనసభ్యులను తనపై చంద్రబాబు రెచ్చగొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణకు పూర్తి మద్దతుగా నిలిచారు. తెలంగాణ అంశంపై పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన శాసనసభా సమావేశాలను అడ్డుకున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు వెంట ఉన్న తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానసశభ్యులు నాగం జనార్దన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర రావు మాత్రం ఈ సంఘటనకు పూర్తిగా దూరంగానే ఉన్నారు. చంద్రబాబును వ్యతిరేకిస్తూ తెలంగాణ కోసం ముందుకు రావడంతో నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణవాదుల నుంచి పూర్తి మద్దతు లభించింది. నాగం జనార్దన్ రెడ్డికి మద్దతుగా అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీ జరిగింది. ఆనాడు వ్యతిరేకించినవారే ఈనాడు ఆయనకు అండగా నిలబడ్డారు. తెలంగాణ న్యాయవాదులతో సహా తెలంగాణవాదులంతా ఆయన మద్దతిస్తున్నారు.












Click it and Unblock the Notifications
