హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమానికి అడ్డుపడను: నాగం దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగి వచ్చారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి చేసిన హంగామా, ఆ తర్వాత మోత్కుపల్లి నరసింహులుతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్ రెడ్డిపై విరుచుకు పడటం వంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం ఉదయం తెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ వద్దని చెప్పలేదని, చెప్పను కూడా అని చెప్పినట్టు సమాచారం.

తెలంగాణ ఉద్యమానికి అడ్డు చెప్పనని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణకు చెందిన అందరు ఎమ్మెల్యేలు కలిసి కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. మిలియన్ మార్చ్ వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాలా వద్దా అనే విషయంపై వారే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే తాను కల్పించుకోనని చెప్పినట్టుగా తెలుస్తోంది.

English summary
TDP president Chandrababu Naidu step back on Telangana issue. He was met Telangana senior leaders on tuesday. He said that he will not stop Telangana agitations of TDP. He suggest them organize agitations with unity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X