అందరం కలిసే ఉన్నాం, తెంలగాణ పోరు ఆగదు: నాగం

పార్టీ తెలంగాణ ఫోరం పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. మిలియన్ మార్చ్‌కు మద్దతుగా తెలంగాణ మంత్రులు ఈ నెల 10వ తేదీ వరకు శాసనసభా సమావేశాలను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్తామని తెలంగాణ మంత్రులు అంటున్నారని, తెలంగాణపై స్పష్టమైన హామీ లభించకపోతే వారు రాజీనామాల లేఖలను సోనియాకు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి గవర్నర్‌కు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు సభను బహిష్కరిస్తున్నప్పుడు తెలంగాణ మంత్రులు సభలో ఉండడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాటకాలు కట్టిపెట్టి పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications