ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోమారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం పాకిస్తాన్‌లోని పెషావర్ పట్టమంలో బాంబు పేలింది. ఈ పేలుడులు సుమారు 25 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్ పోలీసు అధికారులు బాంబు పేలుడును ధృవీకరించారు. బుధవారం యాంటీ తాలిబన్ సమావేశంపై ఈ దాడి చేశారు. పెషావర్ నగరానికి దగ్గరలో ఈ పేలుడు సంభవించిందని జహీద్ ఖాన్ అనే పోలీసు అధికారు చెప్పారు.