నాకొద్దీ పదవి, ఫోరం కన్వీనర్‌గా తప్పుకుంటా: నాగం

ఫోరం కన్వీనర్‌గా ఉండనని గతంలో కూడా ఓ సారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పినట్లు తెలిపారు. అయితే చంద్రబాబు ఉండమని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు తాను కన్వీనర్‌గా పదవీ బాధ్యతల నుండి తప్పుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే మరో శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు బుధవారం ఉదయం ఇచ్చిన స్టేట్‌మెంట్ కారణంగానే నాగం మనస్తాపం చెంది కన్వీనర్‌గా తప్పుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా నాగంనే కన్వీనర్‌గా కొనసాగాల్సిందిగా పలువురు టిడిపి నేతలు కోరుతున్నారు.
అంతకుముందు మోత్కుపల్లి తాను నాగం నాయకత్వంలో పని చేయనని, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications