రాజీనామాకు సిద్ధం, దాడి చిన్న విషయం: ఎంపీ మధు యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: మిలియన్ మార్చ్ నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై పలువురు తెలంగాణవాదులు తనపై చేసిన దాడి చాలా చిన్న విషయమని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పలువురు తెలంగాణవాదులు ఆయనను రాజీనామా చేయమని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణవాదులు తమలో ఉన్న భావోద్వేగాల కారణంగానే దాడి చేశారని అన్నారు. దానిని చిన్న విషయంగా కొట్టి పారేశారు. అయితే తనలాంటి తెలంగాణ వాదులపై దాడుల చేయడం సిగ్గుచేటన్నారు. ఇలా దాడులు చేస్తే తెలంగాణ రాదని ఆయన అన్నారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్, విమలక్క, ప్రజాసంఘాలు రాజీనామా చేయాలని నిర్ణయిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు. దాడి అనంతరం బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద మాట్లాడారు. తనతోపాటు మరికొందరు ఎంపీలు, ఎమ్యెల్యేలు రాజీనామాకు సిద్ధంగా వున్నారని తెలిపారు.

కాగా లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద పోలీస్ వాహనానికి తెలంగాణవాదులు నిప్పుపెట్టారు. ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో డీసీపీ అకున్ సబర్వాల్ వాహనానికి తెలంగాణ వాదులు నిప్పుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+