జపాన్‌లో భయంకరమైన భూకంపం, సూనామీ ప్రమాద హెచ్చరిక

భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి. సబ్ వే వ్యవస్థ పనిచేయకుండా పోయింది. భయకంపితులైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ తీర ప్రాంతాన్ని సముద్రం ఉప్పొంగుతుండడంతో నీరు ముంచెత్తుతోంది. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టోక్యోలోని శివారులో బుల్లెట్ రైళ్లు కూడా ఆగిపోయాయి. యొకోహామాలోని ఇసోగో ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. గత 20 ఏళ్లలో జపాన్‌ను ఇంతటి భయంకరమైన భూకంపం తాకలేదు.












Click it and Unblock the Notifications