జపాన్ ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో మూడో పేలుడు

Fukushima Nuclear Plant
టోక్యో: భూకంపం వల్ల దెబ్బ తిన్న జపాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు చెందిన మరో రియాక్టర్‌లో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఇది మూడో పేలుడు. ఫుకుషిమా నెంబర్ వన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెండో నెంబర్ రియాక్టర్‌లో భారీ పేలుడు సంభవించినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.

శనివారం నుంచి జపాన్ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఇది మూడో పేలుడు. రేడియేషన్ ప్రభావానికి ప్రజలు గురి కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పేలుళ్ల వల్ల రేడియేషన్ వెలువడి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని, అయితే చెర్నోబిల్ స్థాయిలో ఉండదని నిపుణులు అంటున్నారు. రియాక్టర్లు దెబ్బ తిన్న పరిసరాల్లోని వేలాది మంది ప్రజలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+