వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతల్‌నార్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత గణపతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ganapathi
విజయనగరం‌: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్‌నార్ సమీపంలోని అడవుల్లో మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రత్యేక రక్షక దళాల అధికారులు (ఎస్‌పివోలు) మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 35 మంది దాకా మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎంత మంది మావోయిస్టులు మరణించారనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.

పెద్ద యెత్తున అక్కడ మావోయిస్టులున్నారనే అంచనా ప్రభుత్వ బలగాలు వెనక్కి వచ్చాయి. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టాయి. అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతితో పాటు మరో అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో ఆర్కే గాయాలతో తప్పించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు బస్తర్ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం.

English summary
Reports say that Maoist top leader is hiding in Chintalnar forest of Dantewada district of Chhattisgarh. Two days back an encounter took place between Maoists and police. It is said that 35 maoists were killed in this encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X