భారత సంతతి మోడల్ పట్ల ఆస్ట్రేలియాలో జాతి వివక్ష

మీది ఫొటోజెనిక్ ఫేస్ అంటూనే తమ కాస్టింగ్ డివిజన్‌కు సరిపోతుందని ఆ సంస్థ రాజేంద్రన్‌కు తెలిపింది. అయితే, నాన్ కాకేసియన్ హెరిటేజ్‌కు చెందిన మీకు పెర్త్‌లో అవకాశాలు పరిమితంగా ఉంటాయనేది గుర్తించాలని కూడా ఆ సంస్థ వ్యాఖ్యానించింది. మైనారిటీల పట్ల వివక్షను అడ్డుకోవడానికి తనకు జరిగిన అవమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని రాజేంద్రన్ అన్నారు. ఆమె ఇంతకు ముందు యునైటెడ్ కింగ్‌డమ్‌లో మోడల్‌గా పనిచేశారు.
తమ ప్రతిస్పందనను తప్పుగా అన్వయించారని మోడలింగ్ ఏజెన్సీ చెబుతోంది. తమ వ్యాఖ్యలు జాతి వివక్షకు సంబంధించినవి కావని, అలా అనుకోవడం అపహాస్యమని ఏజెన్సీకి చెందిన తాన్యా ముయియా అన్నారు. పెర్త్‌లో ఆమెకు మార్కెట్ ఉండదని చెప్పే స్వేచ్ఛ తమకు ఉందని, తాము నిజాయితీగా ఆ విషయం చెప్పామని అన్నారు.












Click it and Unblock the Notifications