రాజీనామా ఉపసంహరణపై మొండికేస్తున్న జూపల్లి కృష్ణారావు

తాను మంత్రిగా విధులు నిర్వహించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాపై తమ పార్టీ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీన తాను గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లి రాజీనామాను ఆమోదింపజేసుకోవడం అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే తాను రాజీనామా చేశానని, దానికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications