ఒడిషా రైలు ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఐఐటి విద్యార్థుల మృతి
National
oi-Pratapreddy
By Pratap
|
భువనేశ్వర్: ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రైలు ప్రమాదంలో మరణించారు. హైదరాబాదుకు చెందిన డి. దినేష్, శ్రీకాకుళానికి చెందిన బి. తేజస్వి బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మరణించారు. వీరిద్దరు తోషాలి ప్లాజా ప్రాంతంలోని ఐఐటి కాంపౌండ్‌లో తరగతులకు హాజరై వసతి గృహానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు.
తేజస్వి పట్టాలు దాటుతుండగా రైలు వస్తున్న విషయాన్ని గుర్తించి దినేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో దినేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వారు మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఐఐటి కాంపౌండ్ నుంచి వసతి గృహానికి బస్సులు ఉన్నప్పటికీ ముందుగా వెళ్లాలనే ఉద్దేశంతో వారు కాలినడకన బయలుదేరారని సంస్థ అధికారులు చెప్పారు. ఈ విద్యార్థుల మరణంతో ఐఐటిలో విషాద వాతావరణం అలుముకుంది.
Two IIT students belongs to Andhra Pradesh dead in Odisha capital Bhuvaneswar. The students, while crossing the railway track, a goods train colluded. the deceased students Tejaswini and Dinesh belong to Srikakulam and Hyderabad respectively.
Story first published: Thursday, March 17, 2011, 9:56 [IST]