వెనక్కి తగ్గిన సిపిఎం, ముఖ్యమంత్రి అచ్యుతానందన్ పోటీ

Achuthanandan
తిరువనంతపురం: ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కు కేరళ శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని సిపిఎం కేంద్ర నాయకత్వం శుక్రవారం వెనక్కి తీసుకుంది. పార్టీ నాయకత్వం మార్చుకున్న వైఖరిని అచ్యుతానందన్ బద్ధ విరోధి కేరళ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ పోలిట్‌బ్యూరో ఆమోదించిన శానససభ ఎన్నికల పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. ఏ విధమైన భావోద్వానికి తావు ఇవ్వకుండా అచ్యుతానందన్ పేరును ఆయన ప్రకటించారు.

అచ్యుతానందన్ మల్లపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. పార్టీ నాయకత్వం వైఖరిలో అకస్మాత్తు మార్పునకు గల కారణంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అచ్యుతానందన్ 1967 నుంచి పోటీ చేస్తున్నారని, ఇది కొత్త విషయమేమీ కాదని విజయన్ సమాధానమిచ్చారు. అచ్యుతానందన్ అభ్యర్థిత్వంపై పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తారని, ఇంతకు ముందు వార్తలు వచ్చినట్లుగా హోం మంత్రి కొడియేరి బాలకృష్ణనన్ కాదని ఆయన అన్నారు. అచ్యుతానందన్ అనుచరులు నిరసన వ్యక్తం చేయడం వల్లనే ఆయనకు టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని సిపిఎం నాయకత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+