తెలంగాణ ఏర్పడితే రాజకీయ నాయకులకే దెబ్బ: రామ్‌దేవ్ బాబా

Ramdev Baba
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయ నాయకులకే నష్టమని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాన్య ప్రజలకు జరిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన అన్నారు. తన కార్యక్రమంలో ఆయన జై తెలంగాణ నినాదాలు చేశారు.

తెలంగాణ ఏర్పడినా అవినీతిని పారదోలకపోతే లాభం లేదని ఆయన అన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టిస్తోంది అవినీతి కార్యకలాపాలేనని ఆయన అన్నారు. దేశానికి కొత్త పార్టీ అవసరం ఉందని, ఆ పార్టీ వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా రామ్‌దేవ్ బాబా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రధానం చేసుకుని మాట్లాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+