ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గానికి సమాధానంగా చిందేసిన గంగా భవాని!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganga Bhavani
ఏలూరు: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు గంగాభవాని సోమవారం చిందేసి అందరినీ ఆశ్యర్య చకితుల్ని చేసింది. సోమవారం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఏలూరులోని పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అక్కడకు చేరుకొని పోలింగ్ తీరును పరిశీలిస్తున్న గంగాభవానికి జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ అని జగన్ వర్గం నేతలు అమె ఎదుట నినాదాలు చేశారు. వారికి సమాధానంగానో లేక కాంగ్రెసుకే అత్యధిక ప్రజాప్రతినిధులు ఓటు వేస్తున్నారని, కాంగ్రెసు గెలుపు ఖాయమని అనుకున్నారో కానీ గంగాభవాని మాత్రం స్టెప్పులతో అలరించింది.

అక్కడకు వచ్చిన వారితో కలిసి డాన్సు వేసింది. జై సోనియాగాంధీ, జై కాంగ్రెస్ అంటూ ఊగిపోతూ చిందేసింది. అయితే ఎప్పుడు ఆగ్రహంగా, నిప్పులు కురిపించే గంగాభవానికి ఒక్కసారిగా స్టెప్పులు వేయటంతో అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు.

English summary
Ganga Bhavani enjoyed with dance in mlc election today. She went to polling centre and gave slogans Jai Telangana and Jai Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X