సిఎంను కలిసిన దివంగత వైయస్ వ్యక్తిగత కార్యదర్శి సూరీడు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, అనుచరుడుగా పేరుపడ్డ సూరీడు సోమవారం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన ఎందుకు కలిశారనే విషయం మాత్రం తెలియరాలేదు. సూరీడుకు దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి మధ్య అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వైయస్ హయాంలో సూరీడు ఆయనకు రైట్ హాండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు వైయస్ అక్రమాలు తదితర విషయాల్లో సూరీడును కూడా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా వైయస్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జాన్ వెస్లీ భార్య కూడా సిఎం కిరణ్‌ను సోమవారం కలిసింది. అయితే ఈమె పరిహారం కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లుగా తెలుస్తోంది.