హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పాలన గుడ్డిది, నోట్లకు ఓట్లు కొంటున్నారు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గుడ్డిపాలన సాగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. బ్రాహ్మిణిపై అప్పటి ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరించిందన్నారు. స్టీల్ కంపెనీల కోసం భూములను తీసుకొని ఆ తర్వాత చేతులు ఎత్తేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టుపెట్టి బ్యాంకులనుండి రుణాలు తీసుకొని లబ్ధి పొందారని ఆరోపించారు. భూకేటాయింపులపై కాంగ్రెసు ప్రభుత్వం దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.

ప్రభుత్వం భూకేటాయింపులపై వారి అవినీతి బయటపడుతోందని చర్చను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కంపెనీల పేర్లు రిజిస్టర్ కాకముందే ప్రభుత్వం అఫ్పుడు భూములు కేటాయించిందని ఆరోపించారు. భూముల కేటాయింపుపై ప్రభుత్వం జెఎల్పీ వేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జెఎల్పీ వేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఓట్లు కొనుగోలు చేస్తే మరో పార్టీ ఓట్లను అమ్ముకున్నదని ఆరోపించారు. ఓపెన్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓటింగ్ పద్ధతిని భ్రష్టుపట్టించింది కాంగ్రెసు పార్టీయేనన్నారు. ఓపెన్ ఓటింగ్ కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. కాగా చంద్రబాబు మంగళవారం గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును పరామర్శించారు. దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని కోరారు. దళిత, గిరిజనులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.

English summary
TDP President Chandrababu Naidu blamed late YS Rajasekhar Reddy government today. He accused YS ruled as blind. He opposed land allocation of state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X