వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైరామ్ రమేష్‌తో పోలవరం గురించి మాట్లాడా: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేష్‌తో తాను మాట్లాడానని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి మంగళవారం న్యూఢిల్లీలో చెప్పారు. జైరామ్ రమేష్ అందుకు సానుకూలంగా స్పందించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్సుపై వెంటనే స్పందించాలని చెప్పానన్నారు. పోలవరం జాతీయ హోదా కోసం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా పోరాడుతానని చెప్పారు.

పోలవరంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కోసం పోరాడుతానని చెప్పారు. ప్రజల సంక్షేమమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఆ ప్లాంట్‌కు అనుమతి ఇవ్వవద్దని జైరామ్ రమేష్‌ను కోరానని చెప్పారు.

English summary
PRP president Chiranjeevi urged central minister Jairam Ramesh for polavaram project clearance. He opposed nuclear plans in Srikakulam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X