చంద్రబాబు నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు: సిఎం కిరణ్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తాను ఎవరి వద్ద అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఉద్దేశించి మంగళవారం అసెంబ్లీలో అన్నారు. ఎస్సీ, ఎస్టీ భూముల విషయంపై అసంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు అధికార, ప్రతిపక్షాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధికి సబ్ ప్లాన్ క్రింద ఏడు ఏళ్ల కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో ఎంత ఖర్చు పెట్టారలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల వద్ద ప్రస్తుతం నిధులు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు దీక్షను విరమింపే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వం మూడేళ్ళలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ భూములను అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి గురించి ఎవరి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాఘవులు వెంటనే దీక్షను విరమించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో ఎస్టీ మహిళా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా మంత్రి శ్రీధర్‌బాబు సైతం రాఘవులు దీక్షను విరమించాలని కోరారు.
CM Kiran Kumar Reddy and TDP president Chandrababu Naidu make allegations today in assembly one on another. Chandrababu questioned about SC, ST lands. Kiran Kumar Reddy said he was not ready to learn from any other.
Story first published: Tuesday, March 22, 2011, 12:20 [IST]