చంద్రబాబుకు నాగం జనార్దన్ రెడ్డి వ్యూహాత్మకంగానే దూరం

నిజానికి, నాగం జనార్దన్ రెడ్డికి కళ్లెం వేయడానికి చంద్రబాబు మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి వంటివారిని ప్రయోగించారు. కానీ అది అంత సులభమైన పని కాదని చంద్రబాబు భావిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి బయటకు వెళ్లిపోయి తనపై దాడి ప్రారంభిస్తే తెలంగాణ ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పడమే కాకుండా అందుకు నాగం జనార్దన్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు భావిస్తున్నారు. అందువల్లనే నాగం జనార్దన్ రెడ్డిని పార్టీకి దూరం చేయడానికి చంద్రబాబు ఇష్టంగా లేరని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications