జవాబు పత్రాలు చినిగిపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: సోమవారం వరంగల్ జిల్లాలోని జనగామ దగ్గరలోని నిడిగొండ ప్రాంతంలో ప్రమాదం కారణంగా పలువురు ఇంటర్మీడియేట్ విద్యార్థుల సమాధాన పత్రాలు చినిగి పోయిన విషయం తెలిసిందే. 24 మంది విద్యార్థుల పరీక్షా పత్రాలు చినిగిపోయినట్లు ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు గుర్తించారు. వారికి తిరిగి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వారి పత్రాలు వ్యాల్యుయేషన్ చేయడానికి అనుకూలంగా లేనందునే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పత్రాలు వ్యాల్యుయేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటే దానికే ప్రాధాన్యత ఇస్తామని ప్రమాదం తర్వాత అధికారులు చెప్పారు. అయితే వ్యాల్యుయేషన్‌కు అనుకూలంగా లేనందున పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు.
కాగా ఇంటర్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 25లోగా విడుదల చేస్తామని బోర్డు చెప్పింది. సమాధాన పత్రాలు చినిగిన విద్యార్థుల ఫలితాలు కూడా అందరితో పాటే వస్తాయని చెప్పారు. సమాధాన పత్రాలను అధ్యాపకులు అశ్రద్ధగా వ్యాల్యేయేషన్ చేయవద్దని హెచ్చరించింది. ఎవరైనా పేపర్లు అశ్రద్ధగా వ్యాల్యుయేషన్ చేసినట్టుగా తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్ లెక్చరర్లను ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు.