కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కయ్యారా, అవునంటున్న సాక్షి

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటింగులో పాల్గొనడమే వారిద్దరు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని అభిప్రాయపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 122 మంది ఎంపిటీసి, ఇద్దరు జెడ్పిటీసిలు, ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెసు నాయకుల ఆధ్వర్యంలో ఓటేశారని చెప్పిది. చిత్తూరు జిల్లాలో క్రాస్ వోటింగుకు నిరాకరించిన తెలుగుదేశం, కాంగ్రెసు ప్రతినిధులు వైయస్ జగన్ వర్గానికి చెందిన తిప్పారెడ్డికి ఓటేశారని తెలిపింది. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెసు పార్టీకి ఓటేశారని, చంద్రబాబుకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య జరిగిన ఒప్పందం కారణంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీకి దిగలేదని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications