వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మన్మోహన్‌పై సభా హక్కుల ఉల్లంఘన: దద్ధరిల్లిన పార్లమెంటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్ధరిల్లాయి. 2008 జూలై ప్రభుత్వ విశ్వాస తీర్మానం ప్రతిపాదన సందర్భంగా పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేయలేదని ప్రధాని చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ లోకసభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని పరిశీలిస్తామని స్పీకర్ మీరా కుమార్ చెప్పినా బిజెపి సభ్యులు వినలేదు. దానిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. సుష్మా స్వరాజ్ ప్రతిపాదించిన తీర్మానానికి వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. సభా కార్యక్రమాలు స్తంభించడంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు.

సభను స్తంభింపజేసే ఉద్దేశం తనకు లేదని, అయితే ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వనప్పుడు ప్రతిపక్ష ప్రతిస్పందిస్తుందని బిజెపి నేత ఎల్‌కె అద్వానీ అన్నారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై రాజ్యసభ దద్ధరిల్లింది. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభను చైర్మన్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. నోటుకు ఓటుపై చర్చ జరగాలని ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు.

English summary
Accusing Prime Minister Manmohan Singh of "misleading" the House by claiming MPs were not bribed during the July 2008 trust vote, the main Opposition BJP on Tuesday moved a privilege motion in the Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X