వైయస్ఆర్ పార్టీకి త్వరలో సింబల్ వస్తుంది: వైయస్ జగన్
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించనుందని మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కడప జిల్లాలోని పులివెందులలో చెప్పారు. ఎన్నికల సంఘం త్వరలోనే పార్టీకి గుర్తును కేటాయిస్తుందని ఆయన చెప్పారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినందున జగన్ కడపలోనే ఉన్నారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మమేకమయ్యాయని జగన్ వర్గం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. త్వరలో వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Ex MP YS Jaganmohan Reddy said today in Kadapa that CEC will give symbol to YSR Congress Party soon. No body can stop Jagan's power said Jagan camp MP Mekapati Rajamohan Reddy in Nellore.
Story first published: Tuesday, March 22, 2011, 14:20 [IST]