కోదండరామ్‌కు చేయిచ్చిన బిజెపి: టిఆర్ఎస్ పెత్తనమే కారణం

ఇతర పార్టీల వారిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని చెప్పే వారే ఉద్యమానికి ద్రోహం చేసేలా ప్రవర్తిస్తే వారిపై నోరెత్తక పోవడం, ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై బిజెపి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కోదండరామ్ బిజెపిని సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. అయితే సమావేశంలో పాల్గొనే విషయంలో బిజెపిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిహెచ్ విద్యాసాగరరావు వంటి నేతలు తాము జెఏసిలోనే ఉన్నామని చెబుతున్నారు. కానీ జెఏసి తీరుపై మాత్రం వారు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా స్టీరింగ్ కమిటీ సమావేశానికి ముందు కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాన్ని శాంతిభద్రతల కోణంలో చూడవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమం సందర్భంగా అరెస్టయినా వారి తరఫున పోరాడుతామని చెప్పారు. అరెస్టులకు భయపడే విద్యార్థి రాజేష్ చనిపోయారన్నారు. ఉద్యమం వ ాయిదా వేస్తున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఢిల్లీకి వేడి తగిలేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక 8వ అధ్యయంపై హైకోర్టు తీర్పును స్వాగతస్తున్నట్లు చెప్పారు. ఆ అధ్యాయంలో ఉద్యమాన్ని అణిచివేసే విషయంపై సూచనలు చేసినట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications