నా భార్యతో మాట్లాడించండి: శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ విజ్ఞప్తి

Sirish Bharadwaj
హైదరాబాద్: తన భార్య శ్రీజతో మాట్లాడే అవకాశం కల్పించాలని ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు నాంపల్లి కోర్టు పరిధిలో ఉన్నందున తాము స్వీకరించలేమని కమిషన్‌ ఛైర్మన్‌ కాకుమాను పెదపేరిరెడ్డి స్పష్టం చేశారు. సాధారణంగా 498(ఎ) సెక్షన్‌ కింద కేసు నమోదు అయినప్పుడు భార్యభర్తలను కౌన్సెలింగ్‌ చేయాలని, పరస్పరం మాట్లాడుకొనే అవకాశం కల్పించాలని శిరీష్‌ న్యాయవాది నర్సింహారావు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నట్లు చెప్పారు.

కనీసం 5 నిమిషాలైనా శిరీష్‌కు శ్రీజతో మాట్లాడే అవకాశం కల్పించాలని, నగర పోలీసు కమిషనర్‌ జోక్యం చేసుకొని కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కమిషన్‌ను కోరినట్లు వివరించారు. కేసు నాంపల్లి కోర్టులో ఉన్నందున ఛైర్మన్‌ పిటిషన్‌ను తిరస్కరించారని చెప్పారు. కాగా, కట్నం కోసం తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+