హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జునకు, అనుష్కకు ఐటి శాఖ వారం రోజులు గడువు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagarjuna
హైదరాబాద్: టాప్ హీరో నాగార్జున, మరో హీరో రవితేజ, హీరోయిన అనుష్కలతో పాటు నిర్మాతలు అక్కినేని వెంకట్, డి.శివప్రసాద్ రెడ్డిలకు ఆదాయపన్ను శాఖ వారం రోజులు గడువు ఇచ్చింది. వారు కొనుగోలు చేసిన భూముల విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వారని వారిని ఆదేశించింది. వారం రోజుల్లో తెలపాలని ఆదేశించింది. డిమాండ్ నోటీసులు వారికి జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా నిన్న ఐటి శాఖ వీరి ఇళ్లపై దాడి చేసి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

నాగార్జున ఇంటిలో ఐటి శాఖ దాడి చేసినప్పుడు ఆయన ఇంటిలోనే ఉన్నారు. వారికి చెందిన ఎఎన్ఆర్ సంస్థలపైనా ఐటి అధికారులు దాడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని గ్రూపు సంస్థల్లో ఐటి సోదాలు జరిగాయి. ఎఎన్ఆర్ గ్రూపు సంస్థల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు.

హైదరాబాదు, చెన్నై, బెంగళూర్‌ల్లో ఐటి అధికారులు సోదాలు చేశారు. మొత్తం 15 బృందాలు ఎఎన్ఆర్ సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. నాగార్జున పెద్ద యెత్తున డబ్బులు పెట్టి భూమి కొనుగోలు చేసినట్లు ఐటి అధికారులు గుర్తించారు.

English summary
IT asked heros Nagarjuna, Ravi Teja, Heroine Anushka and producer Sivaprasad Reddy today in notice. IT give them week days time to answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X