జగన్‌తో కిరణ్ జిల్లా ఎమ్మెల్యే: భయపడేది లేదన్న ఆది

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంత్రి ధర్మాన ప్రసాద్ సోదరుడు కృష్ణబాబు శుక్రవారం కలిశారు. అయితే ఆయనను ఎందుకు కలిశారో తెలియరాలేదు. ఇక చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి సన్నిహితుడిగా పేరుపడ్డ చిత్తూరు జిల్లాకు చెందిన సికె బాబు కూడా జగన్‌ను కలిశారు. గతంలో కూడా జగన్ విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్సుపై చేస్తున్న ఫీజుఫోరు దీక్షకు వచ్చి పరామర్శించారు. అయితే, రచ్చబండ కార్యక్రమం సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించారు.

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి తనఫై ఫిర్యాదు చేసుకున్నా తాను జగన్ వెంటే ఉంటానని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరవాలేదన్నారు. నాపై ఫిర్యాదు చేస్తే భయపడేది లేదన్నారు. చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ జగన్ వెంట వెళ్లేందుకే తాను సిద్ధమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+