వీసా మోసాల ట్రైవ్యాలీలెన్నో, అమెరికా మోసాల దిబ్బ

నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే అవకాశాలను చాలా విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. కాలిఫోర్నియా, వర్జీనియాల్లో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు చాలా ఉన్నాయని నివేదిక తెలియజేస్తోంది. వీసాలు ఇచ్చే అధికారం ఉండడంతో ఆ సంస్థలు వేలాది మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించి లక్షలాది డాలర్ల లాభాలను ఆర్జిస్తున్నాయని చెబుతోంది.
అమెరికాలో ఏ డిగ్రీ తీసుకున్నా సరే, తమ తమ దేశాల్లో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయని అమెరికాలోని విదేశీ విద్యార్థులు చెబుతున్నారు. దాంతో ఉద్యోగాలు చేస్తూ వీకెండులో మాత్రమే తరగతులకు వెళ్లే అవకాశం కల్పిస్తున్న ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో చేరుతుతున్నారని నివేదిక సారాంశం.












Click it and Unblock the Notifications