హైకోర్టులో మధు యాష్కీకి చుక్కెదురు, కేసు పెట్టాలని ఆదేశాలు

తన కుటుంబ సభ్యుల్ని విదేశాలు తీసుకెళ్లేందుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించడంతో పాటు, నకిలీ ధ్రువ పత్రాల్ని యాష్కీ దాఖలు చేశారని 2009లో నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశరావు ప్రైవేటు పిటిషను దాఖలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లి మధు యాష్కీ అక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారని గొనె ప్రకాశ రావు ఆరోపిస్తున్నారు.