విజయ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన రాయల్ ఛాలెంజర్స్ ఆల్ రౌండర్

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు పిండుకున్నాడు. అతని మెరుపు ఇన్నింగ్ దెబ్బకు ఆర్సీబీ ఏకంగా 222 పరుగులను జమ చేసింది స్కోర్ బోర్డుపై. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ దీన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్దే చతికిలపడింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్ లో జాకబ్ బేథల్ మినహా మిగిలిన బ్యాటర్లందరూ సత్తా చాటారు. వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, చివర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటం బ్యాటింగ్ సైడ్ హైలైట్స్. విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో అయిదోసారి హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, నాలుగుఫోర్లతో 58 పరుగులు సాధించాడు.

Venkatesh Iyer recreates Tamil Nadu CM Vijay Mark celebration After Half Century in RCB vs PBKS

దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లోనే మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 45, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో రెండేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లతో 28 పరుగులు కొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. 19 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. ఎక్కడ కూడా భారీ భాగస్వామ్యం నమోదు కాలేదు. అదే ఈ జట్టు పరాజయానికి కారణమైంది. శశాంక్ సింగ్- 56, కూపర్ కొనొలి- 37, సుయాంష్ షెడ్జె- 35, మార్కస్ స్టొయినిస్- 37 ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది.

ఆర్సీబీ ఇన్నింగ్ లో వెంకటేష్ అయ్యర్ మెరుపులు మెరిపించాడు. 182.50 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అజేయంగా నిలిచాడు. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో అయ్యర్ ఈ సీజన్‌లో తన మొదటి, కెరీర్‌లో 13వ ఐపీఎల్ అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. సీజన్ ఆరంభంలో నిలకడ లేకపోయినా, ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఇప్పుడు సరైన సమయంలో ట్రాక్ ఎక్కాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో ఒక అర్ధసెంచరీతో సహా 162కి పైగా స్ట్రైక్ రేట్‌తో 114 పరుగులు సాధించాడు.

వెంకటేష్ అయ్యర్ ప్రదర్శనతో పాటు, విరాట్ కోహ్లీ కూడా ఆర్‌సీబీకి తనదైన శైలిలో కీలక సహకారం అందించాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే వెంకటేష్ అయ్యర్ సెలబ్రేషన్ ఆకట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. గతంలో పలు సినిమాల్లో చూపిన మార్క్ తో అదరగొట్టాడు. క్రాస్ హ్యాండ్స్ తో సెలబ్రేషన్ చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+