రాజీనామాపై మంత్రి వివేకాను బుజ్జగిస్తున్న ఉండవల్లి, వట్టి

వివేకా వెంటనే సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు వివేకాతో క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు వివేకా ససేమీరా అన్నట్టుగా తెలుస్తోంది. తాను మంత్రి పదవికి రాజీనామానైనా చేస్తాను కానీ క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన తన రాజీనామాను కూడా సమర్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడు అయిన ఉండవల్లి, వట్టి వసంత్ కుమార్‌లు వివేకాను రాజీనామా చేయవద్దని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications