కాంగ్రెసు ముసుగులో వైయస్ జగన్ ఓదార్పు: దేవినేని ఉమ

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు ముసుగులో తన ఓదార్పు యాత్రను చేపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నందున సమావేశాలను పొడిగించాలని ఆయన డిప్యూటీ స్పీకరును కోరారు. సమావేశాలను వారం పాటు పొడిగించాల్సిందిగా ఆయన కోరారు. జగన్ ఆస్తులపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

కాగా ఆఖరి రోజు కూడా అసెంబ్లీలో సీను మారలేదు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేల ఘర్షణ మధ్య నాదెండ్ల సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు సభలో ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించవద్దని సభ్యులను కోరారు. సభ ప్రారంభమయ్యాక విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభ్యులు కోరారు. అయితే ఆయన తిరస్కరించారు. సభ్యులు అందరూ నిలబడి వివిధ అంశాలపై ఒకేసారి మాట్లాడటంతో వారి వారి స్థానాల్లో కూర్చోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+