వైయస్ జగన్ లక్ష్యంగా భూ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నేరుగా వైయస్ జగన్‌ను, ఆయన జగతి పబ్లికేషన్స్‌ను లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేశారు. వైయస్ హయాంలో బ్రాహ్మణి స్టీల్ స్థాపనకు కడప జిల్లాలో భూమిని పొంది, అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి పొందిన కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తావన కూడా చంద్రబాబు చేశారు. వివిధ సంస్థలకు వైయస్ ప్రభుత్వం భూములు కేటాయించడం ద్వారా వైయస్ జగన్ సాక్షి మీడియాలకు నిధులు సమకూర్చుకున్నారని ఆయన ఆరోపించారు.
లోకసత్తా శానససభ్యుడు జయప్రకాష్ నారాయణ వైయస్ రాజశేఖర రెడ్డి పేరును గానీ వైయస్ జగన్ పేరును గానీ ప్రస్తావించలేదు. కానీ ఆయన విమర్శలు, ఆరోపణలు అన్నీ వైయస్ జగన్ మీదనే అనేది స్పష్టంగా అర్థమైంది. గనులను కేటాయించడం ద్వారా వాటిలో ప్రభుత్వ పెద్ద తనయుడు యాభై శాతం వాటా పొందారని ఆయన ఆరోపించారు. ఆ ప్రభుత్వ పెద్ద వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్ అనే విషయం తెలిసిపోతూనే ఉన్నది.












Click it and Unblock the Notifications