వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాలర్ శేషాద్రి నియామకం సబబే: హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా డాలర్ శేషాద్రి నియామకాన్ని పొడిగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. డాలర్ శేషాద్రి నియామకం సబబే అంటూ మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో డాలర్ శేషాద్రికి ఊరట లభించినట్లయింది. డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఉద్యోగుల బాధ్యత విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రోత్సహించడం, అనుమతించడం సరికాదని సుప్రీం తీర్పునిచ్చింది.

సేవా వ్యవహారాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకిందకు తీసుకు రావద్దని చెప్పింది. టిటిడి ప్రత్యేకాధికారిగా శేషాద్రి పదవీ కాలాన్ని పొడిగించడంపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 2006 నుంచి పొడగింపుపై ఆయన పదవిలో కొనసాగుతున్నారు. దీన్ని సవాల్ చేస్తూ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టింది.

English summary
Supreme Court opposed High Court judgement on Dollar Seshadri issue. SP supported government in Seshadri's continue as TTD special officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X