చంద్రబాబుకు చిక్కులు: వారు జూ ఎన్టీఆర్ వర్గం నేతలే

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ వల్లనే చిక్కులు ఎదురవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు మీద తిరుగుబాటు చేస్తున్న శాసనసభ్యుడు కొడాలి నాని, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గరగా ఉంటారు. దాంతో వారు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు పూర్తి మద్దతుగా నిలబడతారు. కృష్ణా జిల్లా పర్యటనలో హరికృష్ణను దేవినేని ఉమ పట్టించుకోకపోవడంతో వారిద్దరు ఆగ్రహించారు. దేవినేనిపై భగ్గుమన్నారు.

దేవినేని ఉమపై బహిరంగ విమర్శలు చేస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ పరోక్షంగా చంద్రబాబును సవాల్ చేస్తున్నారని అంటున్నారు. దేవినేని ఉమను కట్టడి చేయాల్సిన అనివార్యతలోకి చంద్రబాబును నెట్టడమే వారి ఉద్దేశం కావచ్చు. కానీ దాని వెనక హరికృష్ణ ప్రాబల్యం సన్నగిల్లకుండా చూడడమనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చంద్రబాబు హరికృష్ణను క్రమక్రమంగా పక్కకు నెడుతున్నారనే అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు చెందిన నాయకులకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే అభిప్రాయం ఉంది. పార్టీలో రెండో నాయకత్వం కోసం హరికృష్ణ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కొడాలి నానికి, వల్లభనేని వంశీకి గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. కొడాలి నానికి పట్టుబట్టి ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోవడానికి వారికి చంద్రబాబు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+