హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణది చండాలమైన నివేదిక, సభ్యులంతా అవినీతిపరులే: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఓ చండాలమైనదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ధ్వజమెత్తారు. శ్రీకృష్ణను ఆర్థిక వ్యవహారాల సంస్కరణ కమిటీ చైర్మన్‌గా నియమించడాన్ని ఆమె వ్యతిరేకించారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయలేని జస్టిస్ శ్రీకృష్ణ 120 కోట్లమంది ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

శ్రీకృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చినందుకే కేంద్రం ఆయనకు బహుమతిగా ఆ పదవి ఇచ్చిందని అన్నారు. ఆయన తీరు తెరవెనుక పెద్దలకే ఉపయోగపడుతుందని ఆరోపించారు. ఆయనను ఆర్థిక వ్యవహారాల సంస్కరణ కమిటీ చైర్మన్‌గా వెంటనె తొలగించాలని అన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులంతా అవినీతిపరులే అన్నారు. ఆ కమిషన్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజం ఉండదన్నారు.

English summary
Telangana Jagrithi president Kavitha blamed Srikrishna Committee today. She said all the committee members are corruptions. She opposed justice Srikrishna, as he is not impartial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X