దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: దేవినేనికి వల్లభనేని సవాల్

హరికృష్ణ పర్యటన సందర్భంగా ఉమ తీరును తనను బాధించిందని ఆయన అన్నారు. అందుకే తాను జిల్లా అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. తన రాజీనామాను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫాక్స్ చేస్తానని ఆయన చెప్పారు. దేవినేని ఉమ, తన సోదరుడు దేవినేని నెహ్రూపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరూ వేరు వేరు నియోజకవర్గాలలో పోటీ చేయడం కాకుండా ఒకే నియోజకవర్గంలో పోటీ చేసి ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవాలన్నారు. కొడాలి నాని దేవినేనిపై చేసిన వ్యాఖ్యలను వల్లభనేని సమర్థించారు.












Click it and Unblock the Notifications