హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వల్లభనేని వంశీ వెనక హరికృష్ణ, నెహ్రూతో దేవినేని ఉమ ఫిక్సింగ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని నెహ్రూపై విజయవాడ పార్టీ అధ్యక్షుడు వంశీ వల్లభనేని ధ్వజమెత్తడం వెనక రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమపై వంశీ ధ్వజమెత్తి, నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడానికి ముందు శాసనసభ్యుడు కొడాలి నాని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమపై మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఉమపై విమర్శనాస్త్రాలు సంధించారు. వంశీ, కొడాలి నాని నందమూరి హరికృష్ణ కుమారుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు. వీరిద్దరికీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పించింది కూడా జూనియర్ ఎన్టీఆరే కావడం విశేషం.

దేవినేని ఉమపై చాలా కాలంగా హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో తలెత్తిన విభేదాలను, వచ్చిన చీలికను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సరిగా ఉపయోగించుకోలేకపోయారని హరికృష్ణ భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావేనని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీలో ఉన్న తన సోదరుడు దేవినేని నెహ్రూతో ఉమ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

వల్లభనేని వంశీ తరుచుగా నెహ్రూతో తగాదాలకు దిగుతున్నారు. నెహ్రూ, వంశీల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ విషయంలో ఉమ నెహ్రూకు లోపాయికారిగా మద్దతిస్తున్నారనేది వంశీ అభిప్రాయమని చెబుతున్నారు. ఇసుక కాంట్రాక్టుల విషయంలో గానీ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయంలో గానీ ఉమ నోరెత్తకపోవడానికి అదే కారణమని అంటున్నారు. దీంతో ఉమపై విజయవాడ నగరంలో ఆధిపత్యం కోసం వంశీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు వంశీకి హరికృష్ణ మద్దతు లభించడంతో రెచ్చిపోయారని చెబుతున్నారు.

English summary
It is learnt that Telugudesam rajyasabha member Nandamuri Harikrishna is working behind Vallabhaneni Vamsi to revolt against Devineni Umamaheswara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X