చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే విమర్శ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా శతాబ్ది వేడుకల ముగింపు సభలో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలంగాణవాదులు అంటున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణవాసులకు దురభిప్రాయం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాయలసీమలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణవాసులు దురభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి తెలంగాణకన్నా రాయలసీమ వెనుకబడి ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయాల్సి ఉండగా అప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా నీరందుతోందని, అయితే తమతో మాట్లాడిన తెలంగాణవాసులు మాత్రం రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు తరలించుకు వెళ్తున్నారని చెప్పారని ఆయన వివరించారు.

సీఎం కిరణ్ పర్యటనలో చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు మరోసారి అలగడం చర్చనీయాంశమైంది. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలిప్యాడ్ లోపలికి సీకే అనుచరులను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఆగ్రహించిన సీకే వారితో వాగ్వివాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని సెక్యూరిటీ తేల్చి చెప్పడంతో సీఎం వచ్చిన మరుక్షణమే సీకే బాబు అక్కడినుంచి వెళ్ళిపోయారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జోక్యంతో శతాబ్ది వేడుకలు జరుగుతున్న మైదానానికి హాజరైనప్పటికీ వేదికపైకి వెళ్ళలేదు.

English summary
There is a criticism that CM Kiran Kumar Reddy made anti - Telangana remarks in Chittoor district. Kiran Kumar Reddy said that Telanganites are in a false notion that irrigation projects are going to Rayalaseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X