సత్య సాయిబాబా కన్ను మూసినట్లు పుట్టపర్తిలో పుకార్లు

పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందనే వదంతులు శనివారం ఉదయం గుప్పుమన్నాయి. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. పుట్టపర్తిలో డిజిపి అరవింద్ రావు ఏర్పాటు చేసిన సమావేశం నుంచి డిఐజి చారు సిన్హా అకస్మాత్తుగా వెళ్లిపోయారు. దీంతో ఆ వదంతులు మరింతగా వ్యాపించాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందడం వల్ల డిజిపి సమావేశం నుంచి హఠాత్తుగా చారు సిన్హా బయలుదేరి వెళ్లారని అంటున్నారు.
అయితే, సత్యసాయిబాబా ఆరోగ్యం మెరుగ్గా ఉందని సత్య సాయి ట్రస్టు ప్రకటించింది. సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి వదంతులను విశ్వంసించవద్దని ట్రస్టు ప్రజలకు సూచించింది. సత్యసాయిబాబా ఆరోగ్యం బాగానే ఉందని పుట్టపర్తి సిఐ చెప్పారు. సత్య సాయిబాబా వైద్యులతో మాట్లాడుతున్నారని సిఐ అన్నారు. జానకీరామ్ కుటుంబ సభ్యులు ప్రతి రోజూ సత్య సాయిబాబాను కలుస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోకి జానకీరామ్ కుటుంబ సభ్యులను తప్ప ఎవరిని కూడా అనుమతించడం లేదు. బాబా 96 ఏళ్లు జీవిస్తారని, ఇంకా పదేళ్లు సత్య సాయిబాబా బతుకుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications