సత్య సాయిబాబా క్షేమంగా ఉన్నారు: ట్రస్టు మెడికల్ బులిటెన్

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తి సత్య సాయిబాబా క్షేమంగానే ఉన్నారని సత్యసాయి ట్రస్టు ప్రతినిధి చక్రవర్తి ప్రకటించారు. సత్యసాయిబాబా ఆరోగ్యంపై వదంతులు గుప్పుమనడంతో ట్రస్టు శనివారం మధ్యాహ్నం మెడికల్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఆదివారం అర్థరాత్రి శ్వాస తీసుకోవడం సత్యసాయికి ఇబ్బంది అయిందని, తక్షణమే వైద్యులు రంగంలోకి దిగారని, ఇప్పుడు శ్వాస బాగా ఆడుతోందని ట్రస్టు సభ్యులు చెప్పారు. బిపి, షుగర్ సాధారణ స్థాయిల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, సత్యసాయిబాబా భక్తులు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ వారు మీడియాపై విరుచుకుపడ్డారు.

పుట్టపర్తి సత్య సాయిబాబా కన్ను మూసినట్లు అంతకు ముందు పుకార్లు గుప్పుమన్నాయి. అయితే, ఈ పుకార్లను సత్యసాయి ట్రస్టు సభ్యులు ఖండించారు. సత్యసాయిబాబా సూపర్ ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సత్య సాయిబాబా ఉగాది పండుగ రోజు భక్తులకు దర్సనమిస్తారని వారు చెప్పారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగు పడాలని భక్తులు పూజలు చేస్తున్నారు.

పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందనే వదంతులు శనివారం ఉదయం గుప్పుమన్నాయి. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. పుట్టపర్తిలో డిజిపి అరవింద్ రావు ఏర్పాటు చేసిన సమావేశం నుంచి డిఐజి చారు సిన్హా అకస్మాత్తుగా వెళ్లిపోయారు. దీంతో ఆ వదంతులు మరింతగా వ్యాపించాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందడం వల్ల డిజిపి సమావేశం నుంచి హఠాత్తుగా చారు సిన్హా బయలుదేరి వెళ్లారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+